గడిచిన కొన్ని రోజులకు అంబానీ కుటుంబం మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది . అందుకు కారణం అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్ వివాహమే అని చెప్పవచ్చు.. వీరిద్దరు జూలై 12న పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. కానీ అంతకుముందే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలలో అదరగొట్టేస్తున్నారు. మార్చి ఒకటి నుంచి మొత్తం మూడు రోజులు జామ్ నగర్లో వీళ్ళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు సైతం నిర్వహించారు. ఈ వేడుకలకంటే ముందు 51 వేలమంది స్థానికులకు భోజనాలు కూడా వడ్డించారు.. ఇలా వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు కూడా చోటు చేసుకుంటున్నాయి.


అయితే అతిధుల విషయంలో కూడా అది స్పష్టంగా కనిపిస్తున్నది ఈ ఫ్రీ వెడ్డింగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అతిథులు హాజరవుతున్నారు. అయితే టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ కు మాత్రమే ఎందుకు ఆహ్వానం అందింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అనంత అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.. ఇందులో ఆడుతూ పాడుతూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్న గాయనిలు, క్రికెటర్స్ ,సెలబ్రిటీస్, బిజినెస్ మాన్స్ కూడా సోషల్ మీడియా యాక్టివ్ వర్కు ఇలా ఎంతోమందికి ఆహ్వాన పంపించారు.


టాలీవుడ్ నుంచి రాంచరణ్ కు మాత్రమే ఈ వెడ్డింగ్ వేడుకకు ఆహ్వానం లభించింది.. అయితే ఇక్కడ రామ్ చరణ్ కి ఒక్కడికే మాత్రమే దక్కిన ఆహ్వానం కాదు మొత్తం టాలీవుడ్ పరిశ్రమకు దక్కిన గౌరవం అని కూడా చెప్పవచ్చు.. తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రాధాన్యత  ఇస్తూ రామ్ చరణ్ కు ఆహ్వానం పంపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అంబానీ ఫ్యామిలీ అన్ని రంగాల నుంచి కొంతమంది టాప్ సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానాలను పంపించారట. అలాగే టాలీవుడ్ ని గౌరవిస్తూ ముఖేష్ అంబానీ రామ్ చరణ్ కు ఆహ్వానం పంపారు.. అందుకు కారణం రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఈమె క్రేజీ వల్లే రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందినట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: