టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై బిజినెస్ రంగంలో బిజీ అయింది నమ్రత. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మహేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నమ్రత, మహేష్ బాబు పెళ్లి చేసుకోవడం పై కొన్ని ఆసక్తికర విషయాలను వివరించాడు.ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీరిద్దరు పెళ్లితో ఓ అమ్మాయి పిచ్చిది అయిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో మోహన్ కృష్ణ మాట్లాడుతూ నేను అష్టా చమ్మా మూవీకి వర్క్ చేసే టైం లో మహేష్ బాబు ను ఓ మూవీలో గెస్ట్ రోల్ లో తీసుకోవాలని భావించానని.. దానికోసం కొంత స్టోరీ రాసుకొని మహేష్ ను కలవాలనుకున్నానని వివరించాడు. అయితే ఆ సమయంలోనే మహేష్ బాబు నమ్రతను లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో.. తండ్రి కృష్ణ ఆయనను బయటకు రానివ్వలేదని.. దీంతో నేను మళ్ళీ అక్కడకు వెళ్లలేదని వివరించాడు.అయితే వీరిద్దరి పెళ్లి సమయంలో తిరుపతిలో సూపర్ స్టార్ అభిమాని ఓ అమ్మాయి పిచ్చి పట్టి మానసిక పరిస్థితి దుర్భరంగా మారిందని.. మహేష్.. నమ్రతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి.. ఆమె భరించలేక పోయిందని చెప్పుకొచ్చాడు. దీంతో వీధుల్లో తిరిగి రచ్చ రచ్చ చేసిందంటూ వివరించాడు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మహేష్, నమ్రత పెళ్లి చేసుకోవడం వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం అయ్యిందా..? అయితే నమ్రత కారణంగానే అమ్మాయి పిచ్చిది అయిపోయిందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: