ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది..రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలాకు సంబందించిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర భామ రవితేజ 'ధమాఖా'తో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఈ అమ్మడు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇప్పుడే ఈ స్థాయిలో శ్రీలీలా ఊపుతుందంటే.. మున్ముందు ఏ స్థాయిలో సంచలనం సృష్టించబోతోందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..

ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.ఇదిలా ఉండగా.. తనకు పిల్లలు అంటే ఎంతో ఇష్టం.. వారితో గడపడానికి సమయాన్ని కూడా కేటాయిస్తుంది.. సాధారణంగా స్టార్ హీరోయిన్లు కొందరు అయితే పిల్లల్ని పెంచుతారు కానీ తమ దగ్గర ఉంచి పెంచుకోరు. డొనేషన్స్ ఇస్తూ పేరు కోసం చేస్తూ ఉంటారు. ఇక వికలాంగుల పిల్లలను సినీ సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారిని మాత్రమే వారు చేరదీస్తారు.కానీ శ్రీ లీల అలా కాదు. ఈ అమ్మడు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలని చేరదీసింది. ప్రస్తుతం వారి పూర్తి బాధ్యతలను ఈమె చూసుకుంటుంది.. తాజాగా ఒక పిల్లవాడు ఫేస్ కి డ్యామేజ్ అయి ఉంటే ఆ పిల్లవాడు ని నవ్విస్తూ తనని కూడా చేరదీసింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.. నీది నిజంగా గొప్ప మనసు అంటూ తెగ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: