టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమాని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేశారు. 

ఆ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమాలోని మొదటి పాటను ఈ రోజు విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "ఓ మేడమ్" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు ఈ చిత్ర బృందం విడుదల చేయబోతుంది.

ఇకపోతే ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ విడుదల చేయబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే అల్లరి నరేష్ తాజాగా నా సామి రంగ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: