క్రియేటిక్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో ఖడ్గం ఒకటి.ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలను పోషించారు. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తే.. ఉత్తేజ్, పావలా శ్యామల, షఫీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. కార్తికేయ మూవీస్ ఆధ్వర్యంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. దేశభక్తి బ్యాక్‌డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఖడ్గం.. అనేక వివాదల నడుమ 2002న నవంబర్ 29న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.సినిమాతో పాటు పాటులు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దేశ భక్తి మాత్రమే కాకుండా లవ్, ప్యాషన్, ఎమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని కృష్ణవంశీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఆర్టిస్ట్‌లు పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి పాత్ర ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈ సినిమాలో సంగీత పోషించిన పాత్రను అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు.

సినిమా రంగంలో హీరోయిన్ కావాలని ఆరాటపడే సీతా మహాలక్ష్మిగా ఆమె నటించింది. ఒక్క ఛాన్స్ అంటూ అమాయకంగా సంగీత చెప్పే డైలాగ్ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది అనడంలో సందేహం లేదు. ఖడ్గం మూవీలో బాగా హైలెట్ అయిన పాత్రలో సంగీత పోషించిన సీతా మహాలక్ష్మి ముందు వరుసలో ఉంటుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సీతా మహాలక్ష్మి క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ సంగీత కాదు.నిజానికి డైరెక్టర్ కృష్ణ వంశీ ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ గా సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆమె మరెవరో కాదు సాక్షి శివానంద్. టాలీవుడ్ లో నాగార్జున, చిరంజీవి వంటి అగ్రహీరోలతో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసిన సాక్షి శివానంద్‌ను ఖడ్గంలో సీతా మహాలక్ష్మి క్యారెక్ట్ కోసం అడగగా.. ఆమె సున్నితంగా తిరస్కరించిందట. అయితే శ్రీకాంత్ కు జోడీగా సోనాలి బింద్రే పోషించిన స్వాతి పాత్రను తాను చేస్తానని సాక్షి అడిగిందట. కానీ అందుకు కృష్ణవంశీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత సాక్షికి బదులుగా సంగీతను తీసుకున్నారు. ఖడ్గం మూవీ సంగీతకు టాలీవుడ్ లో మంచి గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: