ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ యొక్క రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండవ భాగాన్ని ఈ మూవీ బృందం వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా షూటింగ్ స్పీడ్ ను పెంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ బృందం వారు అల్లు అర్జున్ పై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.  మార్చి 7 వ తేదీ వరకు ఈ సాంగ్ షూట్ జరగబోతుంది. ఆ తర్వాత వైజాగ్ లో ఈ చిత్ర బృందం మరో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రెండు యూనిట్స్ లో ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ జోష్ లో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa