తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ నటి మనులలో ఒకరు అయినటువంటి జయసుధ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాలు పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఆ తర్వాతి కాలంలో సినిమాల్లో తల్లి పాత్రలలో , అక్క పాత్రలలో , వదిన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి వరుస సినిమా లలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈమెపై సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె భర్త చనిపోవడానికి కారణం ఏమి అని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై ఈమె ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఇక తాజాగా జయసుధ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ.లో భాగంగా జయసుధ తనపై వస్తున్న కొన్ని వార్తలపై స్పందించింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జయసుధ మాట్లాడుతూ ... నా భర్త , తమ్ముడు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నా తమ్ముడు లాగానే నా భర్త కూడా సూసైడ్ చేసుకున్నాడు. మాకు ఆత్మహత్య చేసుకునే అంత అప్పులు లేవు. కానీ సోషల్ మీడియాలో నాపై చెడు వార్తలు రాస్తున్నారు. నా భర్త చనిపోవడానికి నేనే కారణం అని కొంత మంది రాస్తున్నారు. నా భర్తను బ్రతికించుకోవడం కోసం నేను చివరి క్షణం వరకు పోరాడాను. కానీ వీధిరాతనం ఎవరు తప్పించలేరు. ఆయనను ఎంత కాపాడుకోవాలి అనుకున్న కూడా ఆయన బ్రతకలేదు. ఆయన మరణం తర్వాత నేను షాక్ లో ఉండిపోయాను అని జయసుధ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: