మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను కన్నడ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈ నటికి తెలుగు లో కూడా మంచి క్రేజ్ లభించింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప పార్ట్ 1" సినిమాలో హీరోయిన్ గా నటించింది.

పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ నటికి ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. దానితో వరుసగా ఈ బ్యూటీ కి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ నటి యానిమల్ అనే హిందీ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో తనకు ఎలాంటి జోనర్ సినిమాలలో నటించాలి అని ఉంది అనే విషయాన్ని వివరించింది. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా రష్మిక మాట్లాడుతూ ... నాకు ప్రస్తుతం ఎక్కువగా యాక్షన్ డ్రామా సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే నాకు రొమాంటిక్ , లవ్ స్టోరీస్ ఉన్న సినిమాలలో నటించాలని చాలా కోరిక ఉంది. అలాంటి పాత్రల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ఈ ముద్దు గుమ్మ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప పార్ట్ 2  , రెయిన్ బో ,  ది గర్ల్ ప్రెండ్ అనే సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm