ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కొంత కాలం క్రితమే సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన "టైగర్ 3" అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కాకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ మాత్రం తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ నటి తెలుగు సినిమాల ద్వారానే తన కెరీర్ ను మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. తెలుగులో ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన మల్లీశ్వరి ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన అల్లరి పిడుగు అనే సినిమా లలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లతో ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన కెరియర్ తొలినాళ్లలో అనేక అవమానాలను ఎదుర్కొన్నాను అని వాటి గురించి స్పష్టంగా తెలియజేసింది. నేను నటిగా కెరియర్ ను ప్రారంభించిన తొలి నాళ్లలో అనేక అవమానాలను ఎదుర్కొన్నారు.

నువ్వు సక్సెస్ కాలేవు అని చాలా మంది నాకు చెప్పారు. మల్లీశ్వరి సినిమా లోని ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఎవరో మైక్ లో ఈమెకు డ్యాన్స్ రాదు. ఈమె డాన్స్ చేయలేదు అని అన్నారు. అది నాకు చాలా బాధను కలిగించింది. ఇలా ఎన్నో అవమానాలను నేను కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్నాను అని కత్రినా తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk