గత సంవత్సరం ఇండస్ట్రీ వర్గాల ఆశక్తి అంతా శ్రీలీల చుట్టూ తిరిగింది. ‘ధమాక’ సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. దీనికితోడు ఆమె మంచి డాన్సర్ కూడ అవ్వడంతో యూత్ లో ఆమె పట్ల మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే శ్రీలీల నటించిన సినిమాలలో ఒక్క ‘భవంత్ కేసరి’ తప్ప మిగతా అన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో పాటు సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ కూడ అంచనాలను అందుకోలేక పోవడంతో శ్రీలీల హవా పూర్తిగా తగ్గిపోయింది.ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల గురించి వార్తలు కూడ ఏమి రావడం లేదు. అయితే అందం గ్లామర్ నటన అన్నీ రంగరించి ఉన్నాయి అని పేరు తెచ్చుకున్న మీనాక్షీ చౌదరి నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోయినప్పటికీ ఆమెకు అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న వరుణ్ తేజ్ ‘మట్కా’ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ దశలో ఉన్నాయి.ఇక లేటెస్ట్ గా అనీల్ రావిపూడి వెంకటేష్ తో తీయబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో కూడ ఈమె హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమె చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ లో కూడ ఈమె మెగా స్టార్ పక్కన కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో ఈమె శ్రీలీల స్థానాన్ని ఆక్రమిస్తుందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి.అయితే సినిమాల ఎంపిక విషయంలో శ్రీలీల చేసిన పొరపాట్లు ఈమె చేయకుండా ఉంటే ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా జయాపజాలను బట్టి హీరోలు హీరోయిన్స్ కెరియర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి రానున్న రోజులలో అదృష్టం ఈమె పట్ల ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అయితే డాన్స్ విషయంలో శ్రీలీల వేగం ముందు మీనాక్షీ చౌదరి నిలబడలేక పోవచ్చు అన్న కామెంట్స్ కూడ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: