లేటెస్ట్ గా విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ భారీ ప్రమోషన్ తో విదలైనప్పటికీ ఈ మూవీని మెగా అభిమానులు కూడ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈమూవీకి కానీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాకపోవడంతో మెగా కాంపౌండ్ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దేశభక్తిని ప్రేరేపించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ ఈసినిమాను ఎవరు పట్టించుకొకపోవడం టాపిక్ ఆఫ్ తి టాలీవుడ్ గా మారింది.ఈమూవీకి వచ్చిన ఘోరమైన ఫ్లాప్ తో వరుణ్ తేజ్ కెరియర్ మరింత సమస్యలలోకి వెళ్ళినట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ కు వాలెంటైన్ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ మూవీ డ్రామాగా నిర్మాణంలో ఉన్న ‘మట్కా’ మూవీ ‘కేజీ ఎఫ్’ తరహాలో తీయాలని ఈమూవీ దర్శక నిర్మాతలు భారీ అంచనాలతో మొదలుపెట్టారు.అయితే ఈమూవీ కథ అంతా 1960 నుండి 1980 వరకు జరిగిన కథకు మాఫియా నేపధ్యం ఉండటంతో ఈమూవీ నిర్మాణానికి భారీ పెట్టుబడి పెట్టవలసి రావడంతో ఈమూవీని మొదట్లో నిర్మించాలని ముందుకు వచ్చిన నిర్మాణ సంస్థ పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు ఈమూవీ నిర్మాణ బాధ్యతలు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ చేతిలోకి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫ్లాప్ తో ఈమూవీ నిర్మాతలు కూడ ఆలోచనలలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటివరకు తీసిన ‘పలాస’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫ్లాప్ కావడంతో ఈ దర్శకుడు సమర్థత పై ఈమూవీ నిర్మాతలకు మాత్రమే కాకుండా ఈమూవీ బయ్యర్లకు కూడ సందేహాలు ఏర్పడే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ ఎంతవరకు ముందుకు వెళుతుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈవార్తలు అన్నీ గాసిప్పుల ప్రచారమే అనీ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ ముందుకు వెళ్ళడం ఖాయం అంటూ మెగా కాంపౌండ్ లీకులుఇస్తూ ఈ గాసిప్పులను ఖండిస్తోంది..    
మరింత సమాచారం తెలుసుకోండి: