‘ఫిదా’ ‘లవ్ స్టోరీ’ సూపర్ హిట్ తరువాత శేఖర్ కమ్ముల చాల గ్యాప్ తీసుకున్నాడు. సాధారణంగా ఈవిలక్షణ దర్శకుడు వేగంగా సినిమాలు తీయడు. అదేవిధంగా టాప్ హీరోలతో సినిమాలు చేయడమే ధ్యేయంగా వ్యవహరించదు. అయితే ఈవిధానానికి భిన్నంగా ఈ విలక్షణ దర్శకుడు తమిళ క్రేజీ హీరో ధనుష్ టాలీవుడ్ టాప్ హీరో నాగార్జునలతో కలిపి ఒక మల్టీ స్టారర్ తీస్తూ ఉండటంతో ఆమూవీ విషయాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాకుండా ఈసినిమా టైటిల్ ‘కుబేర’ అన్నది లీక్ కావడంతో ఈ మూవీ కథ మాఫియా నేపధ్యంలో ఉంటుందని అందరు భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ మహాశివరాత్రి రోజున విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ చూసిన వారికి కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై ఘనవిజయం సాధించిన ‘బిచ్చగాడు’ ఛాయలు కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.చెదిరిన జట్టు మాసిన గడ్డం నలిగిన బట్టలు పాత చెప్పులు వేసుకున్న ధనుష్ మహాశివుడు కి అన్నపూర్ణ దేవి రూపంలో ఉన్న దుర్గా దేవి భిక్ష పెడుతున్న పెద్ద ఫోటో ముందు ధనుష్ నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో ఇది ఒక డిఫరెంట్ మూవీ అన్న సంకేతాలు వస్తున్నాయి. అణగారిన వర్గాల భావాలను చాల సున్నితంగా చూపించడంలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకమైన ఒరవడి ఉంది.ఇప్పుడు డానికి కొనసాగింపుగా ‘కుబేర’ ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ మొట్టమొదటిసారిగా తెలుగులో డైరెక్ట్ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే కాలీవుడ్ లో టాప్ హీరోగా ఒక స్థానాన్ని క్రియేత్ చేసుకున్న ధనుష్ ఈ సినిమాతో తెలుగులో కూడ సక్సస్ అయితే టాప్ హీరోల మధ్య మరింత పెరిగిపోవడంతో ధనుష్ ఎంట్రీతో వెరైటీ కథాలను ఎంచుకోవలసిన ఆవశ్యకత టాప్ హీరోల పై ఉంటుంది..  మరింత సమాచారం తెలుసుకోండి: