
దీంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఎవరైనా అభిమాని ఒక ఫోటో కావాలి మేడం అని అడిగిన ధైర్యం చేసి ఇక హీరోయిన్లు వారికి ఫోటో దిగడానికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా చాలామంది అభిమానులు ఇలా సినీ సెలబ్రిటీలతో ఫోటోలు దిగినప్పుడు హుందాగానే ఉన్నప్పటికీ.. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఏకంగా అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ కు ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా ఈ హీరోయిన్ తో ఫోటో దిగడానికి వచ్చిన ఒక ఆకతాయి.. ఏకంగా నడుము పట్టుకొని ఫోటో దిగడానికి ప్రయత్నించడంతో.. కాజల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అసహనం వ్యక్తం చేసింది.
అయితే ఈ ఘటన గురించి మరవక ముందే మరో హీరోయిన్ కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో ఒక ఆకతాయి విచిత్రంగా ప్రవర్తించాడు. ఏకంగా ఒక ఫోటో కావాలి అంటూ ఆకతాయి ఆమెను వెంబడించాడు. ఏకంగా ఆమె ఎయిర్పోర్టులో వెళుతున్న సమయంలో వెనకాలే అసభ్యకరంగా సైగలు చేస్తూ కనిపించాడు. ఇక ఆ తర్వాత కార్ ఎక్కే సమయంలో ఒక ఫోటో కావాలి అంటూ అడిగాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోటో దిగేందుకు సిద్ధమవ్వగా.. ఆమె ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒకసారిగా అప్రమత్తమైన ఆ హీరోయిన్ అతని నుంచి దూరంగా జరిగి కారు ఎక్కి అతనిపై సీరియస్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.