‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ మూవీని ఓటీటీ శాటిలైట్ ఛానల్స్ లో కొన్ని కోట్లమంది చూశారు. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండటంతో ఇప్పటికీ ఈ సీన్స్ ను చూస్తున్న ప్రేక్షకులు అనేకమంది ఉన్నారు. ఈ మూవీ గత ఏడాది అక్టోబర్ 24న జపాన్ లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.209కి పైగా థియేటర్లతో పాటు 30 దాకా ఐమాక్స్ స్క్రీన్లలో విడుదల అయిన ఆ మూవీని జపాన్ దేశస్థులు బాగా చూడటంతో ఆదేశంలో రెండు వారాల పాటు కలక్షన్స్ మోత మ్రోగి రాజమౌళి పేరు అక్కడ కూడ మారుమ్రోగి పోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమా జపాన్ ప్రేక్షకులకు ఏరేంజ్ లో నచ్చిందో ఆస్థాయిని మించి ‘ఆర్ ఆర్ ఆర్’ అక్కడ ఘనవిజయం సాధించింది.ఈ విజయంతో జపాన్ మీడియా రాజమౌళి పై అనేక వార్తా కథనాలు కూడ ప్రచురించడంతో రాజమౌళి క్రేజ్ అక్కడ కూడ ఏర్పడింది. ఈ ఘన విజయానికి కొనసాగింపుగా రాజమౌళిని ప్రత్యేక అతిధిగా పిలిచి వచ్చేనెల 18వ తేదీన ఒక స్పెషల్ ప్రీమియర్ ను వేయడానికి జపాన్ లోని ఒక ప్రముఖ ఎగ్జిబిటర్ ప్రయత్నిస్తూ ఉండటంతో దానికి సంబంధించిన ఆన్ లైన్ టిక్కెట్స్ బుకింగ్స్ కు విపరీతమైన స్పందన వస్తోంది.దీనితో రాజమోళి మరొకసారి జపాన్ మీడియాకు హాట్ టాపిక్ గా మారబోతున్నాడు. అక్కడి మీదయాతో కూడ జక్కన్న తన భావాలను షేర్ చేసుకునే ఆస్కారం ఉండీ అంటున్నారు. పనిలో పనిగా జక్కన్న అక్కడ మీడియా ఇంటర్వ్యూలలో మహేష్ తో తీయబోతున్నఈ మూవీకి సంబంధించిన విషయాలను లీక్ చేసే అవకాశం ఉంటుంది అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి. దీనితో జపాన్ లో మహేష్ ను ఎలా ఆదరిస్తారు అన్న సందేహాలు కూడ కొందరికి వస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: