అయితే చాలా సింపుల్ గా చాలా సైలెంట్ గా వెంకటేష్ కూతురు మెహంది వేడుక జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. చాలా తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో వెంకటేష్ కూతురు పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న నైట్ మెహందీ వేడుకలు చాలా సింపుల్ గా జరిగాయి . ఈ వేడుకకు మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత - సితార హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి .
నిశ్చితార్ధం వేడుకలు కూడా చాలా సైలెంట్ గా జరిపిన వెంకటేష్ ఇప్పుడు పెళ్లి వేడుకని అంతకంటే సింపుల్గా చేసేస్తున్నారు . దీనికి రీజన్ ఏంటా అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు . వెంకటేష్ కి మొత్తం ముగ్గురు కూతుర్లు .. ఒక అబ్బాయి వీళ్ళ పెద్దమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది . ఇప్పుడు జరగబోయేది రెండో అమ్మాయి పెళ్లి. అయితే వెంకటేష్ తన ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు అని .. మొదటి నుంచి ఆయనది అదే తంతు అని అందుకే ఇలా సింపుల్గా తన కూతురికి పెళ్లి జరుపుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది.నమ్రతతో పాటు కుమార్తె సితార ఘట్టమనేని సైతం హయవాహిని మెహందీ వేడుకలో సందడి చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సితార స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి