ఐకాన్ స్టార్ గా దేశవ్యాప్తంగా అభిమానులను పొందే అవకాశం అల్లు అర్జున్ కు ‘పుష్ప’ కలిగించింది. తనకు ఏర్పడిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ‘పుష్ప 2’ సహకరిస్తుందని బన్నీ భావిస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఈసినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్న అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రియల్ 8న రాబోతోంది.లక్షలాది సంఖ్యలో అల్లు అర్జున్ కు అభిమానులు ఉండటంతో పుట్టినరోజునాడు సోషల్ మీడియాలో హడావిడి చేయాలని బన్నీ అభిమానులు ఇప్పటి నుండే పక్కా ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈపరిస్థితులు ఇలా ఉండగా వచ్చేనెల 8న బన్నీ తన అభిమానులకు రెండు విషయాల పై క్లారిటీ ఇస్తాడాని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.ఏప్రియల్ 8న ‘పుష్ప 2’ కు సంబంధించి ఒక అప్ డేట్ రావడమే కాకుండా అమూవీ విడుదల ఆగష్టులో ఉంటుంది అన్న విషయమై ఈమూవీ దర్శక నిర్మాతల నుండి ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుందని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు. పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ‘పుష్ప 2’ ఆగష్టు 15న విడుదల కావడం కష్టం అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న కొందరి అత్యుత్సాహానికి ఆరోజు బన్నీ తన సినిమా రిలీజ్ డేట్ విషయమై వస్తున్న గాలివార్తలకు బన్నీ నుండి ఆరోజు స్పష్టమైన క్లారిటీ వస్తుంది అన్న ఆశ కూడ అభిమానులకు ఉంది.‘పుష్ప 2’ తరువాత బన్నీ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడు అన్నవిషయమై ఇప్పటికి కూడ క్లారిటీ రావడంలేదు. వాస్తవానికి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయవలసి ఉంది. అయితే ‘గుంటూరు కారం’ ఫెయిల్ అవ్వడంతో బన్నీ ఆలోచనలు మారిపోయి తమిళ దర్శకుడు అట్లీ తో బన్నీ మూవీ ఉంటుందని ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రాధమిక చర్చలు పూర్తి అయ్యాయి అని అంటున్నారు. అయితే అట్లీ చేయవలసిన సినిమాల లిస్టు చాల ఉండటంతో అంతకాలం బన్నీ అట్లీ కోసం ఆగుతాడ లేదంటే సుకుమార్ కోరికమేరకు ‘పుష్ప 3’ వైపు అడుగులు వేస్తాడా అన్నవిషయాలకు బన్నీ పుట్టినరోజునాడు మాత్రమే సమాధానాలు దొరికే ఆస్కారం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: