కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం కాంగువ అనే ఓ భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన హాటెస్ట్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి దిశ పటని ఈ మూవీ లో సూర్య కు జోడి గా కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. 

ఇకపోతే ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మూవీ పై టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు అనగా మార్చి 19 వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో సూర్య అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: