అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ వారు అప్పుడప్పుడు తాము ఏ సినిమాల యొక్క డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నాము అనే వాటి గురించి తెలియజేయడం మాత్రమే కాకుండా కొత్త వెబ్ సిరీస్ లకు సంబంధించిన అప్డేట్ లను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ వారు కొన్ని సినిమాలకు సంబంధించిన టీజర్ లను అలాగే కొన్ని వెబ్ సిరీస్ లకు సంబంధించిన అప్డేట్ లను ఇవ్వబోతుంది అవి ఏమిటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు పవన్ కళ్యాణ్ హీరో గా హరిష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ లీల హీరోయిన్ గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మరియు సూర్య హీరో గా శివ దర్శకత్వంలో దిశా పటాని హీరోయిన్ గా రూపొందుతున్న కంగువ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ రోజు ఈ రెండు సినిమాలు యొక్క టీజర్ లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ వారు దూత సీజన్ 2 కు సంబంధించిన అప్డేట్ ను కూడా ఈ రోజు ఇవ్వబోతున్నారు. అలాగే సిటాడెల్ సీజన్ 1 వెబ్ సిరీస్ గ్లిమ్స్ వీడియోను ఈ రోజు విడుదల చేయనున్నారు. అలాగే ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 ... మీర్జాపూర్ సీజన్ 3 ... పంచాయిత్ సీజన్ 3 ... పాఠా ల్లోక్ సీజన్ 2 ... బందిష్ బందిట్స్ సీజన్ 2 లకు సంబంధించిన అప్డేట్ లను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ వారు ఈ రోజు ఇవ్వనున్నట్లు అలాగే వీటితో పాటు మరి కొన్ని అప్డేట్ లను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: