వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా "గామి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చాందిని చౌదరిమూవీ లో కీలకమైన పాత్రలో నటించగా ... విద్యాధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 8 వ తేదీమా విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు విడుదల అయిన 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన 11 రోజుల్లో నైజాం ఏరియాలో 4.01 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.08 కోట్లు ... ఉత్తరాంధ్ర లో 82 లక్షలు ... ఈస్ట్ లో 66 లక్షలు ... వెస్టు లో 37 లక్షలు ... గుంటూరు లో 43 లక్షలు ... కృష్ణ లో 42 లక్షలు , నెల్లూరు లో 29 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11 రోజుల్లో 8.08 కోట్ల షేర్ ... 14.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి 11 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 88 లక్షలు , ఓవర్ సీస్ లో 2.42  కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11.38 కోట్ల షేర్ ... 21.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 38 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs