కొన్ని చిన్న సినిమాల ఘనవిజయంతో ఆమూవీలో నటించిన హీరోయిన్స్ ఒక్కసారిగా స్టార్స్ గా మారిపోతూ ఉంటారు. గత సంవత్సరం తమిళనాడులో విడుదలై కాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిన్న సినిమాలలో ‘గుడ్ నైట్’ మూవీకి విపరీతమైన స్పందన వచ్చింది. ‘జై భీమ్’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న మణికందన్ ఈమూవీలో హీరో.  అతడి సరసన మీతా రఘునాద్ అనే కొత్త అమ్మాయి ఈమూవీలో హీరోయిన్ గా నటించింది.ఈ ఒక్క సినిమాతోనే ఆమె పేరు కాలీవుడ్ లో మారుమ్రోగి పోయింది. ఈమూవీ ఘన విజయంలో ఆమెదే ప్రధాన పాత్ర. రెగ్యులర్ హీరోయిన్ పాత్రకు భిన్నంగా ఒక నటిని చూస్తున్న ఫీలింగ్ ను రానీయకుండా ఆమె అనాధ పాత్రలో చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు సగటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడ ఆమె బాగా పొందింది.ఈసినిమా తరువాత ఆమెకు చాల అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు అని అంటారు. తమిళనాడు యూత్ లో కూడ ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె ఇప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా తన మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టి ‘నా హృదయం’ అంటూ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. తమిళనాడులో చాలామంది అబ్బాయిలు తమకు భార్యగా మీతా లాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు.వారి కలలకు బ్రేక్ వేస్తు మీత ఇప్పుడు పెళ్లి కూతురుగా మారడంతో కాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఒక అబ్బాయితో ఎప్పటి నుండో రిలేషన్ షిప్ లో ఉందని తాను పెళ్లి చేసుకున్న తరువాత ఆవిషయాన్ని బయటపెట్టింది. ఆమె కామెంట్   కు  అందరూ  షాక్  అయ్యారు .‘గుడ్ నైట్’ మూవీ తో  వచ్చిన గుర్తింపుతో మీతాకు అవకాశాలు బాగానే వస్తాయని భావించారు.  ఈ తరహా మూవీలను ఎంచుకుని ట్రెడిషనల్ రోల్స్‌కే పరిమితం కావాలి  అన్న ఆలోచనతో ఆమె ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటోంది అంటూ కాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..  
మరింత సమాచారం తెలుసుకోండి: