ఒకప్పటి సీనియర్ హీరోలు ఎన్టీఆర్ కృష్ణ కృష్ణంరాజు కాంతారావు పద్మనాభం లాంటి టాప్ స్టార్స్ సినిమా రంగంలో గణించిన తమ డబ్బును తమ అభిరుచికి అనుగుణంగా సొంత సినిమాలు తీసేవారు. అయితే ఇప్పటి తరం హీరోలు మాత్రం సినిమా రంగంలో తాము గణించిన డబ్బును వేరువేరు బిజినెస్ రంగాలలో ఇన్వెస్ట్ చేసి విపరీతమైన లాభాలు గణిస్తున్నారు.డబ్బు విషయంలో అల్లు అరవింద్ ఫ్యామిలీ చాల ముందు చూపుతో జాగ్రత్తగా ఉంటారు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ఈవిషయంలో అల్లు అర్జున్ అనుసరిస్తున్న వ్యూహాలు అరవింద్ కు కూడ ఆశ్చర్య పరిచే విధంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలోని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే బన్నీ అమీర్ పేట లోని సత్యం ధియేటర్ స్థలంలో భారీ మల్టీ ప్లెక్స్ ధియేటర్లు ఏషియన్ సంస్థతో భాగస్వామిగా నిర్మించి మంచి అనుభవం గణించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారి సినిమాలను మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో చూడటానికి ఇష్టపడుతున్న పరిస్థితులలో బన్నీ ఈ ట్రెండ్ కు అనుగుణంగా విజయవాడ విశాఖపట్టణంలో రెండు భారీ మల్టీ ప్లెక్స్ ప్రాజెక్ట్ లను నిర్మాణం చేసే విషయంలో చాల స్పీడ్ గా అడుగులు వేస్తున్నట్లు టాక్. అదేవిధంగా భాగ్యనగరంలో అల్లు కాంపౌండ్ నేతృత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు కూడ చాల వేగంగా జరుగుతున్నాయని ఈ బిజినెస్ లో కూడ బన్నీ చాల భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.ఇప్పటికే మహేష్ వెంకటేష్ విజయదేవరకొండ రవితేజా లు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మల్టీ ప్లెక్స్ ల నిర్మాణానికి చాల వేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితులలో ఇప్పుడు బన్నీ అడుగులు ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతూ ఉండటంతో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ ప్రముఖ హీరోల మల్టీ ప్లెక్స్ లతో ధియేటర్లు కళకళలాడ బోతున్నాయి. ఇలా టాప్ యంగ్ హీరోలు అంతా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు వ్యాపార వేత్తలుగా రాణిస్తున్నారు అనుకోవాలి..  మరింత సమాచారం తెలుసుకోండి: