దక్షిణాది సినిమా రంగంలో అనుష్క రేంజ్ ఒక ప్రత్యేకం. ‘బాహుబలి’ తో ఆమె క్రేజ్ జాతీయ స్థాయికి చేరుకున్నప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని తన అనారోగ్య కారణాల రీత్యా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెకు అనేకమంది దర్శకులు ఆమెతో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ ఆమెకు బాగా నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ చాల సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది.దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆమె క్రిష్ దర్శకత్వంలో ‘వేదం’ మూవీలో నటించింది. ఆమూవీలోని ఆమె పాత్రకు మంచి ప్రశంసలు కూడ లభించాయి. అయితే మళ్ళీ ఆమె క్రిష్ కాంబినేషన్ లో సినిమాను చేసిన సందర్భం రాలేదు. ‘హరిహర వీరమల్లు’ మూవీతో విసిగిపోయిన క్రిష్ అనుష్క తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని మొదలుపెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి.అయితే ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ఏవీ అధికారికంగా రాలేదు. లేటెస్ట్ గా ముంబ‌యిలో జ‌రిగిన అమేజాన్ ప్రైమ్ మీట్‌లో ఈ సినిమాకు  సంబంధించిన విశేషాలను బయటపెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన  టైటిల్‌తో పాటు ప్రి లుక్‌ను కూడ అక్కడ లాంచ్ చేశారు. ‘ఘాటి’ అనే వెరైటీ టైటిల్ ఈ మూవీకి పెట్టడంతో ఈ టైటిల్ కొన్ని గంటలలోనే వైరల్ గా మారింది. యూవీ క్రియేషన్స్ తో కలిసి క్రిష్ కు చెందిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.    తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫస్ట్ లుక్ ను బట్టి ఈ మూవీలో అనుష్క పాత్ర ఒక ధ్యేయం కోసం సాగే పాత్ర లా క‌నిపిస్తోంది. అనుష్క‌ డీ గ్లామ‌ర‌స్ రోల్‌ లో కనిపిస్తోంది. మధ్యానికి బానిసగా మారి ఆతరువాత క్రిమినల్ గా మారి ఆపై తనలా ఒక ఊబిలో చిక్కుకున్న తోటి స్త్రీలను రక్షించే పాత్ర ఇది అని అంటున్నారు. ప్రస్తుతం అనుష్క కు అదేవిధంగా క్రిష్ కు ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆలోటును ఈసినిమా తీరుస్తుందో లేదో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: