దాసరి నారాయణరావు రాఘవేంద్రరావు విశ్వనాథ్ లాంటి టాప్ దర్శకులు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న రోజులలో యంగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణవంశీ 1990 ప్రాంతాలలో సంచలన దర్శకుడు. ‘నిన్నే పెళ్ళాడుతా’ ‘గులాబీ’ ‘సముద్రం’ ‘చందమామ’ ‘ఖడ్గం’ లాంటి అనేక సూపర్ హిట్ సినిమాలు తీసిన కృష్ణవంశీ ఆతరువాత కాలంలో వచ్చిన ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సినిమాలు తీయలేకపోవడంతో వరస ఫ్లాప్ లు అతడిని వెంటాడాయి.దీనితో కృష్ణవంశీ తన టాప్ డైరెక్టర్ స్థానాన్ని కోల్పోయాడు. అయితే అనూహ్యంగా గత సంవత్సరం ప్రకాష్ రాజ్ తో తీసిన ‘రంగమార్తాండ’ కలక్షన్స్ విజయవంతం కాకపోయినప్పటికీ కృష్ణవంశీ మనసుపెట్టి తీస్తే హృదయాలకు హత్తుకునేలా ఒక మంచి సినిమాను ఎలా తీయగలడో మరొకసారి రుజువైంది. ఆమూవీ తరువాత ఈ దర్శకుడు తిరిగి మౌనముద్రలోకి వెళ్ళిపోయాడు.అయితే ఎవరు ఊహించని విధంగా మూడు జంటల మధ్య నడిచే ఒక వెరైటీ ప్రేమ కథకు సంబంధించిన ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశాడట. అయితే ఈ మూవీలో కనిపించబోయే ఆమూడు జంటలు కొత్త నటీనటులను ఎంపిక చేస్తాడట. కృష్ణవంశీ కి అత్యంత సన్నీహితుడు ప్రకాష్ రాజ్ అదేవిధంగా రమ్యకృష్ణ ఈ మూవీలో కీలక పాత్రలలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీలో బాగా పేరున్న సాంకేతిక నిపుణులు ఈమూవీకి పనిచేస్తారని తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని టాక్. ప్రస్తుత తరం అభిరుచులు పూర్తిగా మారిపోవడంతో ఇండస్ట్రి లోకి వస్తున్న యంగ్ డైరెక్టర్స్ కూడ ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తీయలేకపోతున్నారు. దీనితో ఆనాటి తరం అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తీసి హిట్ కొట్టిన కృష్ణవంశీ ఈనాటితరం అభిరుచులను అర్థం చేసుకోగలడా అంటూ ఇండస్ట్రిలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అంచనాలు  లేకుండా వచ్చిన అనేక సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్ కొడుతున్న పరిస్థితుల్లో కృష్ణవంశీ ప్రయోగం ఎలా మారుతుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: