కేరింత' మూవీ ఫేమ్ యంగ్ హీరో పార్వతీశం ప్రస్తుతం 'మార్కెట్ మహాలక్ష్మి' సినిమాతో బిజీగా ఉన్నాడు. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థులల్లో సినిమా చేయడం కంటే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. వాటి కోసం కొంత మంది ప్రాంక్స్ చేస్తుంటే..మరి కొందరేమో వైరల్ అయ్యేలా వీడియోలను చేస్తున్నారు. తాజాగా మరో సినిమా కోసం కూడా మేకర్స్ ఇదే ప్లాన్ ను వర్కౌట్ చేశారు.కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మార్కెట్ మహాలక్ష్మి. కొత్త దర్శకుడు వీఎస్ ముఖేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటిస్తుండగా.. హర్ష వర్ధన్, ముక్కు అవినాష్, మహబూబ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్.అందుకోసం యాంకర్ శ్రీముఖితో ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబందించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారణం ఈ ఇంటర్వ్యూలోనే శ్రీముఖి దగ్గరకు హీరో వచ్చి.. మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ అని చెప్తాడు.. దానికి శ్రీముఖి పార్వతీశంను లాగిపెట్టి కొట్టి.. మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్‌ లాడితే మంచిగుండదు.. అని మాస్ డైలాగ్ చెప్తుంది. దీంతో హీరోని కొట్టిన యాంకర్ అంటూ ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ వీడియోకి కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇక ఇటీవల 'మహాలక్ష్మి' అనే పేరు ఉన్న టాప్ 200 మహాలక్ష్మిలకు మా 'మార్కెట్ మహాలక్ష్మి' సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రమోషన్స్ షూరు చేశాడు పార్వతీశం. ఇందులో భాగంగా స్టేజ్‌పై స్టార్ యాంకర్ శ్రీముఖి ఉండగా.. పార్వతీశం స్టేజ్ పైకి వస్తాడు. శ్రీముఖి దగ్గరకు వెళ్లి మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు శ్రీముఖి చెంప చెల్లుమనిపించి.. 'ఏయ్ మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మనతో మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ చెప్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీముఖికి పార్వతీశం ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: