సన్నీ యాదవ్ అని ఓ యూట్యూబర్ ఉన్నాడు. ఇతడు ఇటీవల అమెరికా వెళ్లాడు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఇతడు సైకిల్ మీద అమెరికా వెళ్లాడని చెప్పుకున్నాడు. సరే ఆయన సైకిల్ మీద వెళ్ళాడా.. మరే దాని మీద వెళ్లాడా అనేది ఎవరూ చూడలేదు. దానికి రుజువులు కూడా లేవు. అలాంటప్పుడు ఆయన చెప్పింది చాలామంది నమ్మారు. కొంతమంది శభాష్ అన్నారు. ఇంకా కొంతమంది తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టావని అన్నారు. ఈ మాటలు అన్వేష్ కు ఎక్కడో తగిలినట్టున్నాయి. ఇంకేముంది అన్వేష్ విమర్శలు మొదలు పెట్టాడు. ఏకంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. తెలంగాణ యాసలో సన్నీ యాదవ్ ను విమర్శించాడు. అసలు అతడు చేసిన యాత్ర మొత్తం అబద్ధమని.. సైకిల్ మీద అమెరికా వెళ్లడం ఎలా సాధ్యమని ధ్వజమెత్తాడు.సహజంగానే అన్వేష్ కు సోషల్ మీడియాలో రీచ్ ఎక్కువ. పైగా అతడు అప్లోడ్ చేసే వీడియోలకు ఫాన్స్ కూడా ఎక్కువే. ఇంకేముంది క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. ఇంకేముంది కొంతమంది అన్వేష్ ను సపోర్ట్ చేశారు. మరి కొంతమంది సన్నీ యాదవ్ కు మద్దతు పలికారు. ఇంకా కొంతమంది ప్రాంతీయ భేదాలను లేవనెత్తడం మొదలుపెట్టారు . ఈ పంచాయితీ ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సన్నీ యాదవ్, అన్వేష్ మధ్య పంచాయితీ అమెరికా వల్ల మొదలైంది కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకుంటే పరిష్కారం అవుతుందేమో.. అసలే అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి.. ఈ పంచాయితీని పరిష్కారం చేస్తే నాలుగు తెలుగు వాళ్ళ ఓట్లు బైడెన్ కు పడతాయేమో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి