ఈ శుక్రువారం విడుదలకాబోతున్న జొన్నలగడ్డ సిద్దూ  ‘టిల్లు స్క్వేర్’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు ప్రధాన పట్టణాలలో కనిపిస్తున్న స్పీడ్ చూస్తున్న వారికి ఈసినిమా ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే ఈమూవీ నిడివికి సంబంధించి వస్తున్న వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి.



ఈసినిమా నిడివి కేవలం 1 ఒక గంట 58 నిముషాలు ఫైనల్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రస్తుతం సినిమాలు బాగుంటే మూడు గంటలు చూడటానికి కూడ ప్రేక్షకులు ఇబ్బంది పడటంలేదు. దీనితో ఇంత చిన్న నిడివితో అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈమూవీని ఎలా పూర్తి చేశారు అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. మరికొందరైతే ఈ నిడివికి సంబంధించిన వార్తలు విని ఈమూవీ సీక్వెల్ లో కథ లేకపోవడంతో కేవలం ‘టిల్లు’ బ్రాండ్ ఇమేజ్ ని నమ్ముకుని ఈసినిమాను తీసారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



సిద్దు జొన్నలగడ్డ ఈసీక్వెల్ కి దర్శకుడిని మార్చడానికి కూడా వెనుకాడలేదు. యంగ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ కు ఇచ్చిన బాధ్యతలకు ఎంతవరకు న్యాయం జరిగింది అన్నసందేహాలు కొందరికి ఉన్నాయి. ఈసినిమాకు సంబంధించి అగ్రెసివ్ ప్రమోషన్స్ కు వెళ్ళకుండా ఈమూవీ ప్రమోషన్ చాల కూల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం విడుదల అవుతున్న చిన్న సినిమాలు కూడ భారీ పబ్లిసిటీ తో విడుదలవుతున్న పరిస్థితులలో టిల్లు ఇలాంటి పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాడు అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు.



ఈసినిమాకు 35 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈస్థాయిలో బిజినెస్ రవితేజా సినిమాలకు కూడ జరగలేదు అని అంటున్నారు. ఈసినిమాకు మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ వస్తే పరవాలేదు కానీ టాక్ లో టాక్ లో ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా ఈమూవీ బయ్యర్లకు తీవ్ర స్థాయిలో నష్టం వచ్చే ఆస్కారం ఉంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: