సీనియర్ హీరో శ్రీకాంత్ 100 సినిమాలకు పైగా విభిన్న పాత్రలలో నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 1990 ప్రాంతంలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ సినిమాలతో సరిసమానంగా ఆరోజుల్లో అతడి సినిమాలు ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు అనేకం.ఆతరువాత టాప్ యంగ్ హీరోల హవా మొదలుకావడంతో శ్రీకాంత్ సినిమాల జోర్ తగ్గింది. దీనితో మారిన పరిస్థితులకు అనుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా శ్రీకాంత్ కొన్ని సినిమాలలో నటిస్తున్నప్పటికీ ప్రస్తుతం అతడి మ్యానియా అటు ప్రేక్షకులలో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో పెద్దగా లేదు. దీనితో అందరి హీరోలు లాగే శ్రీకాంత్ కూడ తన వారసుడు రోషన్ ను హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్ళి సంద D’ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాడు.ఆమూవీలో అతడి నటనకు లుక్ కు ఎటువంటి నెగిటివ్ మార్క్ లు పడిబనప్పటికీ అతడికి ఇండస్ట్రీ నుండి పెద్దగా అవకాశాలు రాకపోవడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇతడితో అదే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పటికే క్రేజీ హీరోయిన్ గా మారిపోతే రోషన్ పేరు చాలమంది మర్చిపోయారా అని అనిపిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో ఛాంపియన్ అన్న మూవీ ప్రారంభం అయినప్పటికీ ఆమూవీ షూటింగ్ ముందుకు వెళుతున్నట్లు వార్తలు రావడంలేదు.మోహన్ లాల్ తో మలయాళంలో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘వృషభ’ లో రోషన్ కు కీలక పాత్ర లభించినప్పటికీ ఆసినిమాకు సంబంధించిన వార్తలు కూడ రావడం లేదు. దీనితో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ విషయంలో సరైన ప్లానింగ్  అనుసరించడం లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో అందం సమర్థత ఉన్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోతే ప్రస్తుత పోటీ వాతావరణంలో యంగ్ హీరోలకు అవకాశాలు దక్కడం కష్టం అన్న కామెంట్స్ కు రోషన్ కెరియర్ ఒక ఉదాహరణ అంటూ కొందరి అభిప్రాయం..    


మరింత సమాచారం తెలుసుకోండి: