సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అటు సినీ సెలబ్రిటీలే వారి పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉండటం గమనార్హం. సోషల్ మీడియాలో అభిమానులతో నేరుగా మాట్లాడటం కూడా చేస్తూ ఉన్నారు.


 తద్వారా సిని ప్రేక్షకులకి సినీ సెలబ్రిటీలకి మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పటిలా ఎక్కడో షూటింగ్ జరుగుతున్న చోటుకు వెళ్లి దూరంగా నిలబడి తమ అభిమాన నటులను చూసి ఆనందపడి ఇంటికి వచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏకంగా నేరుగా సెలబ్రిటీలతో మాట్లాడుతూ తాము అడగాల్సిన ప్రశ్నలు అన్ని అడిగేస్తున్నారు అభిమానులు. అయితే ఇక సినిమా హీరో హీరోయిన్లు తమ లైఫ్ స్టైల్ గురించి కొన్ని కొన్ని సార్లు అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ స్టార్ డమ్ గురించి చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.



 స్టార్ డమ్ అనేది శాశ్వతంగా ఉండదు అంటూ బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చారు. అందుకే సామాన్యురాలుగా బతకడమే నాకు ఎంతో ఇష్టం అంటూ తెలిపింది. ఇప్పటికీ తాను స్వయంగా మార్కెట్కు వెళ్లి నచ్చిన వస్తువులు తెచ్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది ఈ స్టార్ హీరోయిన్. అందరితో కలిసి పావుబాజీ తింటానని అందులోనే నాకు ఆనందం దొరుకుతుంది అంటూ చెప్పింది. ఇక ఇటీవల తన పుట్టినరోజును కూడా అభిమానులతో కలిసి జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఇటీవల మోస్ట్ స్టైలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ స్టార్ అవార్డుతో శ్రద్ధ కపూర్ ని సత్కరించడం గమనార్హం. ఇలా స్టార్ హీరోయిన్ గా అయినప్పటికీ.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శ్రద్ధ కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: