ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానుల విషెస్ తో సోషల్ మీడియా కూడా షేక్ అవుతోంది. తమదైన శైలిలో చరణ్ పై అభిమానం చాటుతూ విషెస్ తెలియజేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సెలబ్రిటీలు...సన్నిహితులు..స్నేహితులు అంతా కూడా రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే తన బావ చరణ్ కి ఎంతో ప్రత్యేకంగా విషెస్ తెలియజేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చరణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి హ్యాపీ బర్త్ డే అంటూ చరణ్ ని విష్ చేసారు.అల్లు అర్జున్ పెట్టిన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రామ్ చరణ్ వైట్ కలర్ షర్ట్ ప్యాంట్ లో ఉండగా..బన్నీ మాత్రం బ్లాక్ దుస్తుల్లో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. చూస్తుంటే ఇది పబ్ లో దిగిన ఫోటో లా ఉంది. బర్త్ డ్ పార్టీ ఎంజాయ్ చేస్తోన్న సమయంలో క్యాప్చర్ చేసిన పిక్ అనుకుంట ఇది. మరి ఈపార్టీలో ఇంకా ఎవరెవరు? ఉన్నారు? అన్నది మాత్రం తెలియాలి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.


చరణ్‌..బన్నీ అభిమానుల్ని ఈ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటుంది. బావ-బామ్మర్ది ఇద్దరు ఒకే ప్రేమ్ లో అంటూ ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.వీరు ఇద్దరు కూడా ప్రస్తుతం పేరున్న పాన్ ఇండియా స్టార్లే! మరి ఆ ఇద్దరు కలిసి సినిమా చేసేది? ఎప్పుడంటూ ఓ నెటజన్ పోస్ట్ చేసాడు. వాళ్లిద్దరు కలిసి నటించాలని అల్లు అరవింద్ చిరంజీవి కూడా అంతే కోరుకుంటున్నారు.ఇద్దరి కోసం ఇప్పటికే చరణ్- అర్జున్ అంటూ అరవింద్ ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించిన సంగతి కూడా తెలిసిందే. పైగా ఆ కాంబినేషన్ ని అరవింద్ గారే నిర్మిస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. ఇక రామ్ చరణ్ కి టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సహా పలువురు సెలబ్రిటీలు విషెస్ తెలియజేసారు.రామ్ చరణ్ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని.. తను ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉంటాడని.. పెద్ద వారి పట్ల.. సాంప్రదాయ పద్ధతులు పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తాడని.. ప్రతి విషయంలో కూడా విద్యార్థిలా నడుచు కుంటాడన్నారు. ఇవే తనకి శ్రీరామ రక్ష` అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: