సిద్ధు జొన్నలగడ్డ రచనతో మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. ఈ వారాంతంలో సినీప్రియులను అలరించడానికి ఈ సినిమా రెడీ అవుతోంది.లాస్ట్ టైం డార్క్ క్రైమ్-కామెడీ జానర్ లో డీజే టిల్లు ఫార్ములా బాగా వర్కవుటైంది. ఇప్పుడు సీక్వెల్ తో కూడా అదరగొట్టబోతున్నాడని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీకి అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ అదనపు బలం. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, హీరో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధ్యమవుతాయని అంచనా వేస్తున్నారు.ఇక ఇప్పటికే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ బాగా దూసుకెళ్లింది. తాజా ప్రమోషనల్ ఈవెంట్లో టిల్లూ స్క్వేర్ సినిమా విడుదల సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలకు రెండు రోజుల ముందు విడుదల చేసిన కొత్త ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.


రెండు ట్రైలర్‌లు టిల్లు స్క్వేర్ రేంజును బాగా పెంచాయి. అవి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేందుకు సాయం అయ్యాయి. ఈ ట్రైలర్ ఆద్యంతం సిద్ధు జొన్నలగడ్డ మార్క్ తెలంగాణ స్లాంగ్ ఇంకా ఆహార్యం బోలెడంత వినోదం పంచుతున్నాయి. అదే సమయంలో అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్, బోల్డ్ సీన్స్ లో గట్స్ అభిమానులను ఎంతగానో టీజ్ చేస్తున్నాయి. అనుపమలో రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ కానుంది.ఇక తాజా ప్రమోషనల్ వేదికపై ఈ సీక్వెల్ బ్లాక్‌బస్టర్ అవ్వడం గ్యారెంటీ అంటూ అతిథులు అభిప్రాయం కూడా వ్యక్తం చేసారు. టిల్లు స్క్వేర్ లో ఓ ప్రముఖ నటి కూడా అతిథి పాత్రలో మెరవనుందని, ఈ సినిమాకి తదుపరి సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ మూవీ dj టిల్లు కంటే వినోదాత్మకంగా ఉంటుందని, క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుందని వేదికపై సిద్ధూ ఇంకా నిర్మాత నాగవంశీ వెల్లడించారు. దీంతో పాటు తదుపరి సీక్వెల్‌కి లీడ్‌గా, క్లైమాక్స్‌లో ప్రత్యేక క్యామియో కూడా జోడించడం ఇప్పుడు ఎంతగానో ఆసక్తిని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: