టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలలో చాల నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తులలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ముందు వరుసలో ఉంటాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలో సోషల్ మీడియాలో చాల దూకుడుగా కామెంట్స్ చేసే ఈయన కామెంట్స్ కొన్ని సందర్భాలలో వివాదాస్పదంగా మారినప్పటికీ ఆవిషయాలను ఇతడు పెద్దగా పట్టించుకోడు.సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతగా వరసపెట్టి సినిమాలు తీస్తున్న ఈయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమధ్య కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా అన్నది ప్రేక్షకుల వినోదం కోసం కోట్లు ఖర్చుపెట్టి నిర్మించే ఒక వ్యాపారం అనీ అందులో లాజిక్ లు వెతకడం అనవసరం అని తన అభిప్రాయం అంటూ సినిమా కథలో లాజిక్ లు వెతకడం ఏమిటి అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.తాము నిర్మించిన ‘గుంటూరు కారం’ మూవీ విషయంలో మాత్రమేకాదు ఏటాప్ హీరో సినిమాల విషయంలోను లాజిక్ లు వెతకవద్దని సూర్యవంశీ అభిప్రాయ పడుతున్నాడు. ‘సలార్’ సినిమాలో ఒక టాటూ చూసి విలన్ గ్యాంగ్‌ అదిరిపోయిన సీన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ లాంటి టాప్ హీరో నటించిన భారీ సినిమాలో లాజిక్ గురించి ఆలోచిస్తే కుదరదనీ కేవలం హీరో పాత్రను ఎలివేట్ చేయడం కోసం క్రియేట్ చేసిన సీన్ గా మాత్రమే చూడాలి అంటూ ఈ నిర్మాత అభిప్రాయ పడుతున్నాడు.ఇక తాము తీసిన ‘గుంటూరు కారం’ మూవీలో హీరో పదే పదే గుంటూరు-హైదరాబాద్ ట్రావెల్ చేయడం గురించి వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. అలా వెళ్తే తప్పేంటి.. హీరో జర్నీ అంతా చూపించి, మధ్యలో టీ తాగితే అదీ చూపించాలా అంటూ నాగవంశీ జోక్ చేశాడు. ఈమూవీలో ప్రీ క్లైమాక్స్ ముందు కుర్చీ మడత పెట్టి’ పాట పెట్టామని.. కానీ ఆ పాటలోకి శ్రీలీల ఎలా వచ్చిందంటూ శ్రీలీల ఎలా వచ్చింది అంటూ లాజిక్స్ వెతికారని అలా వెతికిన వారు కూడ ఆపాటను ఎంజాయ్ చేశారు అంటూ నాగవంశీ లాజిక్ లపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..    మరింత సమాచారం తెలుసుకోండి: