హారర్ సినిమాలకు కామెడీ టచ్ ఇస్తే ఈమధ్య కాలంలో ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి ట్రెండ్ ను క్రియేట్ చేసింది లారెన్స్ అయినప్పటికీ ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ వరసపెట్టి కనీసం సంవత్సరానికి 4-5 సినిమాలు ఇలాంటి జోనర్ లో వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ‘ఓం భీమ్ బుష్’ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఆ ట్రెండ్ ను కొనసాగించాలని ఏప్రియల్ 11న మరొక దెయ్యం సీక్వెల్ రాబోతోంది.ఆసమయానికి ఫ్యామిలీ స్టార్ హడావిడి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి తమ దెయ్యం సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ సీక్వెల్ కు మంచి కలక్షన్స్ వస్తాయని ఈమూవీని నిర్మించిన కోన వెంకట్ భావిస్తున్నాడు. దాదాపు 6 సంవత్సరాల క్రితం వచ్చిన ‘గీతాంజలి’ మూవీకి ఇది సీక్వెల్ అని అంటున్నారు. అంజలి ప్రధాన పాత్రలో శివ తుర్లపాటి అనే యంగ్ డైరెక్టర్ తీసిన ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు బాగా పెరుగుతున్నాయి.గతంలో విడుదలైన అనేక హారర్ సినిమాల మాదిరిగా ఇందులో కూడ పాడుబడిన ఒక బంగళా దాంట్లో షూటింగ్ కోసం వెళ్లిన ఒక యూనిట్ సభ్యులు ఇలా ఒక రొటీన్ కథ అయినప్పటికీ ఈకథలో అనేక ట్విస్ట్ లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈపాతపడిన భవనంలో కొందరు వ్యక్తులు ఆసినిమా యూనిట్ వారికి కనిపించడంతో వారంతా ఆభవనంలో ఉన్న వ్యక్తులుగా అందరూ భావిస్తారట. అయితే వారంతా దెయ్యాలు అన్నషయం ఆయూనిట్ వారికి చాల ఆలస్యంగా తెలుస్తుంది.అలా తెలిసిన తరువాత ఆ యూనిట్ సభ్యులకు ఎదురైన వింత సంఘటనలు ఆతరువాత ముందుకు వెళ్లలేకా వెనక్కు రాలేకా ఆ యూనిట్ సభ్యులు పడే  పాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విధంగా ఈమూవీలోని సీన్స్ ఉన్నాయి అంటున్నారు. శ్రీనివాసరెడ్డి సునీల్ షకలక శంకర్ సత్యం రాజేష్ సత్య అలీలతో పాటు ఈసారి రవిశంకర్ కూడ ఈమూవీలో తొడవ్వడంతో ఈమూవీ ఈ సమ్మర్ రేస్ లో విజయం సాధిస్తుందని కోన వెంకట్ నమ్మకం..  మరింత సమాచారం తెలుసుకోండి: