ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఒక సినిమా కథ విన్నప్పుడు ఆకథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని అంచనా వేసే విషయంలో చాల నిష్ణాతుడు అన్న పేరు ఉంది. దీనికితోడు అతడు తీసే సినిమా కథకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి అయి ఒక బౌండ్ బుక్ గా తయారైనప్పుడు మాత్రమే అతడు సినిమాను మొదలుపెడతాడని అంటారు. అలాంటి దిల్ రాజ్ తన సినిమాల విషయంలో తనకున్న జడ్జిమెంట్ తప్పుతున్నాడా అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



గత కొంతకాలంగా దిల్ రాజ్ తీస్తున్న సినిమాలు అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో కొందరు ఈకామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం దిల్ రాజ్ తమిళ టాప్ హీరో విజయ్ తో తీసిన ‘వారసుడు’ ఏవరేజ్ గా ఆడింది. అంతకు ముందు నాగచైతన్యతో తీసిన ‘థాంక్యూ’ భయంకరమైన ఫ్లాప్ గా మారింది. అంతకన్నా ముందు వచ్చిన ‘ఎఫ్ 3’ ‘వకీల్ సాబ్’ సినిమాలు కూడ దిల్ రాజ్ కు పెద్దగా లాభాలు తెచ్చి పెట్టలేదు అని అంటారు.



ఈమధ్య కాలంలో దిల్ రాజ్ తీసిన చిన్న సినిమాలు ‘రౌడీ బాయ్స్’ ‘షాదీ ముబారక్’ ‘ఇద్దరి లోకం ఒకటే’ కూడ ఫ్లాప్ అయ్యాయి. కరోనా సమయంలో దిల్ రాజ్ నానితో తీసిన ‘వి’ ఓటీటీ లో డైరెక్ట్ గా రిలీజ్ అయినా పెద్దగా ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక లేటెస్ట్ గా దిల్ రాజ్ భారీ అంచనాలతో విడుదల చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆమూవీ కలక్షన్స్ భయకరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



దీనితో నిర్మాతగా దిల్ రాజ్ తన సినిమాల కథల విషయంలో తప్పటడుగులు వేస్తున్నాడా అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న ఆనలుగురు లో ప్రముఖుడుగా పేరు గాంచిన దిల్ రాజ్ కు ఈ వరస ఫ్లాప్ లు పెద్దగా ఎటువంటి సమస్యను సృష్టించవు అన్న విషయం యదార్థం అయినప్పటికీ కథల విషయంలో మంచి పట్టు ఉన్న దిల్ రాజ్ లాంటి నిర్మాత కూడ ఏసినిమా కథ ప్రేక్షకులకు నచ్చుతుందో మరే కథ నచ్చదో సరైన జాడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నారు అన్నవిషయానికి ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఒక ఉదాహరణ..  






మరింత సమాచారం తెలుసుకోండి: