నాచురల్ స్టార్ నాని మరికొంత కాలంలో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ నైట్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ నాని కెరియర్ లో 32 వ సినిమాగా రూపొందనుండడంతో ఈ మూవీ ని "నాని 32" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది.

ఇక ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొంత కాలం లోనే పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత నాని, సుజిత్ దర్శకత్వంలో రూపొండబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం సుజిత్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజీ" అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్ల అనంతరం పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాని , సుజిత్ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది. ఇకపోతే ప్రస్తుతం సుజిత్, నాని మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో హీరోయిన్ గా భాగ్య శ్రీ భోర్స్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కి సుజిత్ కథను వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో ఈ బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రవితేజ, హరీష్ శంకర్ కంబోలో పొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: