అక్కినేని నాగచైతన్య కెరీర్లో “మజలి” మూవీ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది..శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నాగచైతన్య, సమంత మరియు దివ్యాంశ కౌశిక్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కంప్లీట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మజిలీతో మంచి మెమరబుల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నాగచైతన్య నో చెప్పినట్లు తెలుస్తోంది. 'మజిలీ' తో నాగచైతన్య కి మంచి సక్సెస్ అందించిన శివ నిర్వాణ మరోసారి చైతు తో మూవీ చేసేందుకు గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.. దీంతో మరోసారి 'మజిలీ' కాంబినేషన్ రిపీట్ కాబోతుందని  అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే తాజాగా నాగచైతన్య శివ నిర్వాణకి నో చెప్పాడని సమాచారం.శివ నిర్వాణ చెప్పిన కథ నాగచైతన్యకి అంతగా నచ్చలేదట. దాంతో చైతూ ఈ మూవీకి నో చెప్పినట్లు తెలిసింది. 

షైన్ స్క్రీన్ బ్యానర్ ఈ మూవీని తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ నాగ చైతన్య రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ ఆగిపోయిందని సమాచారం. మరి శివ నిర్వాణ కథలో మార్పులు చేసి మరో హీరోకి వినిపిస్తారా లేక మరో ఫ్రెష్ స్టోరీ సిద్ధం చేస్తారా అనేది చూడాలీ..అయితే దర్శకుడు శివ నిర్వాణ గత ఏడాది విజయ్ దేవరకొండ, సమంతను హీరో, హీరోయిన్లుగా  'ఖుషి' సినిమాని తెరకెక్కించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.నిన్నుకోరి, మజిలీ లో వున్న ప్యూర్ ఎమోషన్స్ 'ఖుషి' మూవీ లో కనిపించలేదు.దీనితో ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ వచ్చింది.అలాగే గతంలో శివ నిర్వాణ నానితో తెరకెక్కించిన టక్ జగదీశ్ మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో శివ నిర్వాణ తన స్టోరీస్ పై మరోసారి రీ రివ్యూ చేసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: