అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గా బాలీవుడ్ లో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వి కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ త్వరలోనే టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా విడుదల కూడా కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లు వస్తున్నా ఒక సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు తన తండ్రి బోనీకపూర్ నిర్మిస్తున్న మైదాన్ అనే సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది.

 ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది జాన్వి కపూర్. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల  సూట్ వేసుకుని మీడియా ముందుకు వచ్చింది. అయితే వేసుకున్న డ్రెస్ కంటే ఆమె మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ పైన అందరి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే అన్ని నెక్లెస్ పైన షికు అని పేరు ఉండడం కారణంగా అందరి చూపు ఆ నెక్లెస్ పైన పడింది. అయితే ఆ నెక్లెస్ ఎవరిచ్చారు.. ఏంటి అన్న సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. జాన్వి కపూర్ అప్పట్లో “కాఫీ విత్ కరణ్” అనే కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ “నీ స్పీడ్ డయల్ లిస్టులో ఎవరు ఉంటారు” అని ప్రశ్నించాడు. దానికి జాన్వి తండ్రి పేరు,

చెల్లి పేరు, షికర్ పేరు చెప్పింది. వెంటనే “ఇప్పటికే చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పాను.. మీరు అర్థం చేసుకోండి” అంటూ కరణ్ జోహార్ కు హింట్ కూడా ఇచ్చేసింది. జాన్వి, షికర్ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. తరచూ ఇద్దరు కలిసి ఆలయాలకు వెళ్తుంటారు. మీడియా ఫోకస్ చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోరు. ఇటీవల వీరిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో వీరి మధ్య సీనియర్ నటి మహేశ్వరి కూడా ఉంది. అయితే తన బంధంపై వీరిద్దరూ ఎప్పుడు కూడా పెదవి విప్పలేదు. ఇక వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే తీరుగా వార్తలు రోజుకో తీరుగా బయటికి వస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: