మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి జాన్వీ కపూర్ గురించి ఇండియన్ సినీ లవర్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె శ్రీదేవి, బోని కపూర్ లా కూతురుగా హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా ఈమె శిఖర్ పహడియా తో  ప్రేమలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

తాజాగా ఈ బ్యూటీఈవెంట్ కు వెళ్ళింది. ఆ ఈవెంట్ కు జాన్వి ఓ నక్లెస్ ను వేసుకొని వెళ్ళింది. ఇక ప్రస్తుతం ఈ నక్లెస్ బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జాన్వి తాజాగా తన మెడలో వేసుకున్న నక్లెస్ పై శిఖు అనే పేరు ఉంది. దానితో ఈమె నిజంగానే శిఖర్ తో ప్రేమలో ఉంది అని... అందుకే అతను పేరుతో ఉన్న నక్లెస్ ను ధరించింది అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.

మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీకి తెలుగులో మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కింది. మరికొన్ని రోజుల్లో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ రూపోందబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వాటికి జాన్వి కూడా అటెండ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: