తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ ద్వీపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయ్యింది. అయినప్పటికీ ఇన్ని రోజుల పాటు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇక తాజాగా ఈ రోజు ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు గోట్ ఉంట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

తాజాగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇకపోతే విజయ్ ఆఖరుగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.

ఇక వెంకట్ ప్రబు కొంతకాలం క్రితం నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన కస్టడీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక వెంకట్ ప్రభు ఆఖరుగా దర్శకత్వం వహించిన మూవీ ఫ్లాప్ అయినప్పటికీ గోట్ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: