తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగి పోయింది. దానితో మన తెలుగు సినిమా బడ్జెట్లు కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఒకప్పుడు 20 కోట్లు, 30 కోట్ల తో సినిమా పూర్తయింది అంటేనే అంత డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి అని సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇక రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా 40 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఆ సమయంలో ఆ బడ్జెట్ ను చూసి అంతా షాక్ అయ్యారు.

కానీ ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆ బడ్జెట్ ను తిరిగి తీసుకువచ్చింది. ఇకపోతే ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా సినిమాలు అంటూ 300 , 400 , 500 కోట్లు పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాలలో అయితే ఒక్కో సన్నివేశానికే కోట్లలో డబ్బును ఖర్చు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప పార్ట్ 2" మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే.

సినిమా మొదటి పార్ట్ మంచి విజయం సాధించడంతో రెండో పార్ట్ ను చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. దానితో ఈ సినిమా మొదటి భాగం కంటే కూడా రెండవ భాగం బడ్జెట్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ కేవలం ఆరు నిమిషాల వ్యవధితో ఉండబోతుందట. కాకపోతే ఈ సన్నివేశం కొరకు మూవీ యూనిట్ ఏకంగా 60 కోట్లు ఖర్చుపెట్టిందట. ఇలా ఒక్క సీన్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు పెట్టారు అంటే ఈ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఉండి ఉంటుంది అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: