తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమైన జోష్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగించిన ప్రియమణి ప్రస్తుతం అడబా దడపా సినిమాల్లో నటిస్తూనే టీవీ షో లకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తుంది . కెరియర్ బిగినింగ్ లో ఈమె జగపతి బాబు  , జూనియర్ ఎన్టీఆర్ , బాలకృష్ణ , నాగార్జున మరియు మరి కొంత మంది క్రేజీ హీరోల పక్కన నటించి తెలుగు పరిశ్రమలో చాలా కాలం కెరియర్ను ఫుల్ జోష్ లో ముందుకు సాగించింది.

ఇక ఆ తర్వాత ఈమె తమిళ , కన్నడ, హిందీ మూవీలలో కూడా నటించింది . తాజాగా ఈ బ్యూటీ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందిన మైదాన్ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఆ సినిమా తాజాగా విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ బ్యూటీ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనను స్టార్ హీరోల సినిమాలలో ఎందుకు తీసుకోవడం లేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా ప్రియమణికి స్టార్ హీరోలా పక్కన ఎందుకు నటించడం లేదు అనే ప్రశ్న ఎదురైంది..? దీనికి ప్రియమణి సమాధానం ఇస్తూ... ఆ విషయం నాకు కూడా అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు. మీరు హీరోలు, దర్శక నిర్మాతలను ఇదే ప్రశ్న అడిగితే బాగుంటుంది అంది. ఆ తర్వాత కొంత మంది చెప్పిన దాన్ని బట్టి నేను ఏ సినిమాలో అయినా నటిస్తే వారిని డామినేట్ చేస్తాను. నా పక్కన ఉన్నవారు పెద్దగా ఫోకస్ అవ్వరు. ఆ కారణంతోనే నన్ను స్టార్ హీరోల సినిమాలలో తీసుకోవడం లేదు కావచ్చు అనే అభిప్రాయాన్ని ఈ బ్యూటీ వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: