బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మరుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేశారు. ఈ మూవీ కి "సికిందర్" అనే టైటిల్ లో కన్ఫామ్ చేస్తూ ఈ మూవీ యూనిట్ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సల్మాన్ ఈ మధ్యకాలంలో నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేదు. కొంతకాలం క్రితం ఈయన "టైగర్ 3" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేదు.

ఇక మురగదాస్ కూడా ఈ మధ్య కాలంలో వరస అపజాయలను ఎదుర్కొంటున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు రజనీ కాంత్ హీరోగా రూపొందిన దర్బార్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుస అపజాయలతో డీలా పడిపోయిన ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతున్న మూవీ అయినప్పటికీ ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

దర్బార్ మూవీ తర్వాత మురగదాస్ ఈ సినిమా కోసం చాలా ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. ఈ మూవీ మొత్తం కథ తయారు చేయడానికి మురగదాస్ ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ చాలా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు... ఇందులో సల్మాన్ నటన కూడా విభిన్నమైన రీతిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మురగదాస్ హిందీలో గజిని మూవీ ని రూపొందించాడు. ఇది బ్లాక్ బాస్టర్ అయ్యింది. దానితో ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: