టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి ఇప్పుడు బాలీవుడ్ కి మకాం మార్చింది ప్రియమణి. రావణ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి అదరగొట్టేసింది. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ హిట్ లతో దూసుకుపోతోంది. మలయాళం లో వచ్చిన నేను తెలుగు ఓటిటి మూవీ భామకలాపం టు హిందీ సినిమా ఆర్టికల్ 370 సినిమాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ కూడా వరుసగా మంచి విజయాలను అందుకుంటున్నాయి.

అయితే తాజాగా అజయ్ దేవగన్ సరసన మైదాన్ సినిమాలో కూడా కనిపించింది ఈమె. ఏప్రిల్ 10 నుండి థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.  అయితే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అచ్చం ముస్లిం మహిళల తయారై ఫోటోల కి ఫోజులు ఇచ్చింది ప్రియమణి. గ్రీన్ గాగ్రా చోళీ ధరించి ముంతాజ్ జువెలరీ తో అలంకరించుకుంది. అలా మంచిగా రెడీ అయిన ఈమె తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈద్ ముబారక్ అని తన అభిమానులకు తెలిపింది.

అయితే దీనిపై మీరు చాలా ఆనందంగా ఉన్నారని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేర్కొంది.. అయితే జై శ్రీరామ్ అంటూ కొంత మంది రాసుకొస్తున్నారు. నవరాత్రికి కూడా ఏం పోస్టు చేయలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆమెను నెటిజన్లు ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తున్నారు. వాస్తవానికి ఆమె అయ్యంగార్ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇది కేరళలో బ్రాహ్మణ వర్గం కిందకు వస్తుంది. కేరళలోని అయ్యర్ తల్లిదండ్రులకు బెంగళూరులో జన్మించింది. చదువు ముగించాక ఎవరే అతగాడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పెళ్లైన కొత్తలో మూవీతో హిట్ అందుకుంది. అటు తమిళంలో కూడా అడుగుపెట్టి..పరుత్తి వీరన్ మూవీతో జాతీయ అవార్డును గెలుచుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో పేర్లర్‪గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: