త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక అలాంటి మన స్టార్ హీరోకి తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే చెన్నైలోనే పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే ఈనెల 13 న చెన్నైలోని పల్లవరంలోనే వేల్స్ వర్షువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే అక్కడికి శని నిర్మాతలు యూనివర్సిటీ ఛాన్స్లర్ ఈసారి గణేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరపబోతున్నారు.

 ఇక ఈ వేడుకల కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు డిజి సీతారాం తెలుగు సినీ ఇండస్ట్రీకి రామ్ చరణ్ అందించిన సేవలకి గాను మేఘ పవర్ స్టార్ రాంచరణ్ కి ఈ గౌరవమైన డాక్టరెట్ ను అందజేయబోతున్నారు. కాగా ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు రాజకీయ ప్రముఖుల సైతం రాబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత రామ్ చరణ్ కి అరుదైన గౌరవం దగ్గర అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: