ఇటీవల కాలంలో ఇతర భాషలకు చెందిన నటులు అటు తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇటీవల అటు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజమన్నార్ పాత్రలో నటించి మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఏ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరకంగా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి ఉండే క్రేజ్ అటు పృధ్విరాజ్ సుకుమారన్ కు తెలుగులో వచ్చేసింది.


 అయితే సలార్ మూవీ తర్వాత ఇటీవల ఆడు జీవితం అనే మూవీ తో థియేటర్లలో మరోసారి సందడి చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. ఇక ఇటీవలే ఒక బాలీవుడ్ మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించగా ఇందులోనూ పృధ్విరాజ్ నటనకు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు ఈ మలయాళీ హీరో.


 కాగా ఇటీవల తన లైఫ్ లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన భార్య సుప్రియా మీనన్ తో జరిగిన ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. పృధ్విరాజ్ సుకుమారన్ కు కార్లు అంటే పిచ్చి. ఇక మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన కొనాలని అనుకుంటాడట. కానీ తన భార్య సుప్రియకు లగ్జరీ కార్లంటే అంత పెద్దగా ఆసక్తి ఉండదట. అయితే ఓ రోజు తన భార్యను సర్ప్రైజ్ చేసేందుకు ఫెరారీ కారు కొనుగోలు చేశాడట. స్కాట్లాండ్లో ఉన్నప్పుడు ఫెరారీ కాలిఫోర్నియా కార్ ను పరిచయం చేస్తే ఆ కారును కొనుగోలు చేసి.. భార్యకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. తీరా కారు తెచ్చి రైడ్ కి వెళ్దాం అంటే..  ఆమె ఆ కారులో రాను ఇష్టం లేదు అంటూ చెప్పింది. దీంతో మా అసిస్టెంట్ కి ఆ కారు ఇచ్చి మామూలు కారులో మేము రైడ్ కి వెళ్ళాం అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్.

మరింత సమాచారం తెలుసుకోండి: