సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలి అంటే వరుసగా అవకాశాలు అందుకోవాలీ అంటే అందం అభినయం మాత్రమే కాదు అంతకుమించి అదృష్టం కూడా కలిసి రావాలి. ఇలాంటి అదృష్టం లేకే ఎంతోమంది అందమైన హీరోయిన్లు ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత కనుమరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో వేద అలియాస్ అర్చన కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో చేసిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు  కానీ బిగ్ బాస్ షో ద్వారా మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది.


 అయితే గతంలో ఇక హీరోయిన్గా చేస్తున్న సమయంలో పలువురు హీరోలతో మితిమీరిన రొమాంటిక్ సీన్లలో కూడా అర్చన నటించింది అంటూ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. కాగా ఇప్పుడు అర్చనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వైరల్ గా మారిపోయింది. గతంలో ఓ సినిమాలో నటుడు శివాజీ తో చేసిన బోల్డ్ సీన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది అర్చన. సినిమాలో బోల్డ్ సీన్స్ చేసే సమయంలో మీరు కేవలం నటనగానే భావిస్తారా.. లేదంటే నిజంగానే ఫీల్ అవుతారా అంటూ యాంకర్ ప్రశ్న అడిగారు.


 ఈ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పింది అర్చన  ఫీల్ అయ్యేంత సినిమా అక్కడ ఉండదు  సెట్స్ లో మన పక్కన ఎంతోమంది ఉంటారు  అప్పుడు మూడ్ తెచ్చుకుని ఫీల్ అవుతూ చేయాల్సిన పని ఉండదు. కాకపోతే ఆ సీన్ కి తగ్గట్లుగా పెర్ఫార్మన్స్ ఇస్తాం అంతే. రొమాంటిక్ సీన్లు అలాంటి ఫీల్ తో రాకుంటే జనాలు నవ్వుకుంటారు. ఏ హీరోతో రొమాంటిక్ సీన్స్ చేసిన అతను ఒక వస్తువు నేను ఒక వస్తువు అనే భావిస్తాను. ఎమోషనల్ గా ఫీల్ అవ్వను. హీరో శివాజీతో కమలతో నా ప్రయాణం మూవీలో నటించినప్పుడు కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాను. ఒకసారి కూడా రొమాంటిక్గా ఫీల్ కాలేదు. అక్కడ అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే సీన్లు బాగా పండాలి అనే ఉద్దేశంతో ముందుగానే రొమాంటిక్స్ సీన్లను ప్రాక్టీస్ చేసేదాన్ని. హీరో శివాజీ తో కూడా ఇలాగే మాట్లాడుకుని ముందు ప్రాక్టీస్ చేశాను.  అందుకే ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లో పూర్తయ్యాయి. మిగతా వాళ్ల విషయం నాకు తెలియదు. నా వరకు అయితే అది కేవలం నటన మాత్రమే అంటూ అర్చన చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: