సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూనే వివిధ కంపెనీ యాడ్ లలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అలాగే మహేష్ ఇప్పటికే థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఏషియన్ సంస్థతో కలిపి "ఏ ఎం బి" అనే థియేటర్ ను కూడా స్థాపించాడు. ఇక హైదరాబాద్ నగరంలో ఈ థియేటర్ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ థియేటర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది.

ఇలా మహేష్ హైదరాబాదులో స్థాపించిన థియేటర్ ఇప్పటికే సూపర్ సక్సెస్ కావడంతో ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ మరో థియేటర్ ను కూడా నిర్మించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం నుండి ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబు హైదరాబాదు లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ ను అనేక మార్పులు చేర్పులు చేసి అత్యంత అధునాతన టెక్నాలజీతో మల్టీ ప్లెక్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా సుదర్శన్ థియేటర్ లో ఏషియన్ గ్రూప్ , మహేష్ బాబు తో పాటు మరో టాలీవుడ్ స్టార్ హీరో కూడా పార్టనర్ గా ఉండబోతున్నారు అని తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ థియేటర్ లో విక్టరీ వెంకటేష్ కూడా ఓ పార్టనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా థియేటర్ కి "ఏ ఎం బి విక్టరీ" గా ఇప్పటికే పేరును అనుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే సుదర్శన్ థియేటర్ కి హైదరాబాద్ నగరంలో ప్రత్యేక క్రేజ్ ఉంది. అంతటి క్రేజ్ కలిగిన ఈ థియేటర్ ను ఏషియన్ , మహేష్ , వెంకటేష్ ముగ్గురు కలిసి నిర్మించనుండడంతో దీనిలో అత్యాధునిక టెక్నాలజీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: