తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమానులలో కృతి సనన్ ఒకరు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి "1 నేనొక్కడినే" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈమె ఇందులో తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నాగ చైతన్య హీరో గా రూపొందున దోచేయ్ అనే మరో తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ కూడా ఈమెకు చేదు అనుభవాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందించింది. దానితో ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం కృతి వరుస పెట్టి హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను నిర్మించే విషయంలో దర్శక నిర్మాతలు అనేక అపోహల్లో ఉన్నట్లు చెప్పింది.

లేడీ ఓరియంటెడ్ సినిమాలను నిర్మిస్తే ప్రేక్షకులు వాటికి రారు అనే భావన చాలా మంది దర్శక నిర్మాతల్లో ఉంది అని ... లేడీ ఓరియంట్ సినిమాకు వెళితే తాము చెల్లించిన టికెట్ కి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు అది సరైన అభిప్రాయం కాదు అని కృతి సనన్ వెల్లడించింది.

ఈ విషయంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులలో చాలా మార్పు రావాలి అని ఈ ముద్దు గుమ్మ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ "క్రూ" అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి 100 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో కృతి సనన్ తో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ టబు మరియు కరీనా కపూర్ కూడా ప్రధాన పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks