హీరోయిన్ గా ఫెడౌట్ అయినప్పటికీ తన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్. హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్లు కాసిని ఇండస్ట్రీలో కొనసాగుతోంది.  టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే తమిళంలో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి తెలుగు స్టార్ హీరోల అందరి సరసన ఆడి పాడింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోలతో కూడా కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు చిరంజీవి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో కూడా  నటించింది. అయితే ఇప్పటివరకు టాలెంట్స్ ని ''

ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్ లో గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా తన చిన్ననాటి స్నేహితుడు గౌతంను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలా ఈ ముద్దుగుమ్మ కెరియర్ కి చాలా గ్యాప్ వచ్చింది.  వరుస సినిమాల అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కొంతకాలం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి తన జీవితాన్ని ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అప్పటిలాగా కాకుండా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకి పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

సినిమాలు చేస్తుంది కానీ దర్శక నిర్మాతలకు ఈ ముద్దుగుమ్మ కొన్ని కండిషన్ లు పెడుతోంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పెడుతున్న కొత్త కండిషన్స్ మేకర్లకు డైరెక్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయట. అటు నిర్మాతలకు కూడా చెమటలు పట్టించేస్తుందట కాజల్. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్ రొమాంటిక్ సీన్స్ విషయంలో మాత్రం కండీషన్స్ అప్లై అంటోందట. ఈ విషయంలో తన నిర్ణయం మారదని తెగేసి చెప్పేస్తుందట. సినిమా ఏది అయినా.. తన పరిధి దాటి చేయనంటోందట. ముఖ్యంగా లిప్ లాక్ లు, రొమాంటిక్ సీన్స్ , బెడ్ సీన్స్ ను అస్సలు చేయనంటోందట కాజల్. అంతే కాదు ఎక్స్పోజింగ్ పాత్రలు కూడా ఆమె నో చెపుతోందట. అవసరమైతే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను కాని... ఆ పని మాత్రం చేయను అంటోంది కాజల్ అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: