ఇప్పటివరకు ఈ సంవత్సరం అనేక సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలు వరుసగా చాలా రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేశాయి. అలా ఈ సంవత్సరం ఎక్కువ రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసిన మూవీ లు ఏవి ..? అందులో టిల్లు స్క్వేర్ మూవీ ఏ స్థానంలో ఉంది అనే విషయాలను తెలుసుకుందాం.

తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ప్రీమియర్స్ తో కలుపుకొని 20 రోజుల పాటు వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.


ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వాసులు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ వరసగా పది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలో నేహా శెట్టి ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sj