బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ రామాయణ. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమా కు కేజీఎఫ్ హీరో యశ్ కోప్రొడ్యూసర్ గా మారడం విశేషం.యశ్ కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి.రామాయణం గురించి ప్రపంచానికి చెప్పాలన్నదే ఈ సినిమా ఉద్దేశమని యశ్ తెలిపారు.వెరైటీ మ్యాగజైన్ తో మాట్లాడిన అతడు.. ఈ మూవీ ఎలా ఉండబోతోందో వెల్లడించారు. రామాయణం గురించి ఎన్నిసార్లు చెప్పినా.. ప్రతిసారీ కొత్తగా చెప్పడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందని యశ్ తెలిపారు.రామాయణం మనందరికి బాగా తెలుసు అని అనుకుంటాం.కానీ ప్రతిసారీ ఏదో ఓ కొత్త జ్ఞానాన్ని అందించడం తో పాటు ప్రత్యేకమైన దృక్పథాలను పరిచయం చేస్తుంది. ఈ కాలాతీతమైన ఇతిహాసాన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడమే మా లక్ష్యమని యశ్ వివరించారు..


రామాయణ మూవీ ఎంతో అద్భుతంగా ఉండనుంది.ఈ కథను అందులోని భావోద్వేగాలు, విలువలను చెప్పడంలో మేము నిజాయతీ గా ఉంటాం. రామాయణాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సాగే ప్రయాణమిది" అని యశ్ తెలిపారు.ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయిలో చూపించే మూవీస్ ను నిర్మించాలన్నది తనకు ఎప్పటి నుంచో ఉన్న లక్ష్యమని ఈ సందర్భంగా యశ్ తెలిపారు . ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కు చెందిన నమిత్ ను కలిసేందుకు యశ్ లాస్ ఏంజిల్స్ వెళ్లారు."రామాయణం నాలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రామాయణాన్ని కో ప్రొడ్యూస్ చేయడానికి మేము చేతులు కలిపి, ఇద్దరి విజన్, అనుభవాలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అభిరుచికి తగిన ఇండియన్ సినిమాను క్రియేట్ చేయాలని భావించాం" అని యశ్ తెలిపారు. ఈ సినిమా లో యశ్ రావణుడి పాత్ర పోషించబోతున్నట్లుగా ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: